ల్యాండ్‌మైన్‌ పేలుడు.. పదిమంది మృతి

25 Apr, 2017 12:04 IST|Sakshi

ఇస్లామాబాద్: ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్‌ ల్యాండ్‌మైన్‌ ధాటికి ముక్కలైంది. పాకిస్తాన్‌లోని కుర్రం ఏజెన్సీలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో పదిమంది మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు.

అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. వాహనం గొడార్‌ గ్రామం నుంచి సొడా గ్రామానికి వెళ్తుండగా ల్యాండ్‌మైన్‌ పేలుడు సంభవించింది. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని హెలికాఫ్టర్‌ సహాయంతో పెషావర్‌కు తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పంజాబ్‌ ముఖ్యమంత్రి షాబాజ్‌ షరీఫ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుర్రం ఏజెన్సీ ఆఫ్గన్‌ సరిహద్దుల్లో ఉన్న ట్రైబల్‌ ప్రాంతం.

మరిన్ని వార్తలు