ఉగాండాలో అల్లర్లు..55 మంది మృతి

28 Nov, 2016 01:36 IST|Sakshi
ఉగాండాలో అల్లర్లు..55 మంది మృతి

కంపాలా: ఉగాండాలో భద్రతా బలగాలు, వేర్పాటువాదులకు మధ్య  ఘర్షణలో 55 మంది మృతి చెందారు.  కసేసీ నగరంలో పోలీసులు, సైనికులు శనివారం గస్తీ నిర్వహిస్తుండగా వెన్‌జు రురు ప్రాంత రాజుతో సంబంధమున్న వేర్పాటు వాదులు  గ్రనేడ్ విసిరారు. దీంతో ఓ సైనికుడు గాయపడటంతో తిరిగి వారిపై ఎదురుకాల్పులకు దిగారు.

నలుగురు వేర్పాటువాదులు మృతి చెందారు. దీంతో స్థానికంగా అల్లర్లు చెలరేగడంతో 14 మంది పోలీసులు, 41 మంది మిలిటెంట్లు మృతి చెందారు. అల్లర్లకు బాధ్యుడిని చేస్తూ ఉగాండా పోలీసులు వెన్‌జురురు రాజు  ముంబేరేను అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు