55 ఏళ్ల సుజీ..సో క్రేజీ..

20 Sep, 2017 20:23 IST|Sakshi
55 ఏళ్ల సుజీ..సో క్రేజీ..
క్వీన్స్‌లాండ్‌: అందాల పోటీ అనగానే 18 ఏళ్ల సన్నజాజులో..20 ఏళ్ల మెరుపు తీగలో తళుక్కున మెరవడం చూస్తుంటాం. కానీ 55 ఏళ్ల తల్లి బ్యూటీ పోటీల్లో అందాల కిరీటాన్ని గెలుచుకోవడం అబ్బురమే. క్వీన్స్‌లాండ్‌కు చెందిన సుజీ డెంట్‌ అనే బ్యూటీ క్వీన్‌ను అంతర్జాతీయ అందమైన భామల టైటిల్‌ వరించింది. గత వారాంతం లాస్‌వేగాస్‌లో జరిగిన మిస్‌ ఎర్త్ పోటీల్లో ఈ సుందరాంగి స్విమ్‌సూట్‌ మోడల్స్‌ను, మాజీ మిస్‌ వరల్డ్‌లను తలదన్ని మూడో స్ధానంలో నిలిచింది.
 
ఈ పోటీల్లో పాల్గొన్న వారిలో సుజీనే ముదురు భామని జడ్జీలు పేర్కొన్నారు. సుజీ అందాల పోటీలకు కొత్త అయినా ఎందరో మోడల్స్‌తో పోటీపడి ప్రతిష్టాత్మక టైటిల్స్‌ను గెలుచుకుంటోంది. 50 ఏళ్లు పైబడిన వయసు, అందాల పోటీలకు అవసరమైన కొలతలు లేకున్నా సహజమైన అందంతో, కృత్రిమత్వానికి భిన్నంగా నన్ను నేనుగా ఆవిష్కరించుకుంటూ న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నానని ఆమె చెబుతున్నారు.
>
మరిన్ని వార్తలు