ట్రంప్‌పై 56 శాతం అమెరికన్ల అసంతృప్తి

31 Aug, 2017 18:46 IST|Sakshi
ట్రంప్‌పై 56 శాతం అమెరికన్ల అసంతృప్తి

వాషింగ్టన్‌: అధ్యక్షుడు ట్రంప్‌ పట్ల అమెరికన్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దేశాన్ని ఐక్యంగా ముందుకు నడిపించాల్సిన ట్రంప్‌ విభజించేలా వ్యవహరిస్తున్నారని 56 శాతం అమెరికన్లు మండిపడ్డారు. డెమొక్రాట్లలో 93 శాతం​ ఇలా చెబుతుంటే...రిపబ్లికన్లు మాత్రం ట్రంప్‌ ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తున్నారని 15 శాతం మందే అభిప్రాయపడ్డారు. ఇక మొత్తంమీద పోల్‌లో పాల్గొన్న వారిలో 33 శాతం ఓటర్లు ట్రంప్‌ దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకువెళుతున్నారని చెప్పారు.  ఉత్తర కొరియా విధానం, రష్యా, పర్యావరణం, హెల్త్‌ కేర్‌, వర్ణ వివక్ష వంటి పలు అంశాల్లో ట్రంప్‌ పాలనకు నెగెటివ్‌ రేటింగ్‌లు వస్తున్న క్రమంలో తాజాగా ఫాక్స్‌ న్యూస్‌ పోల్‌ సైతం ట్రంప్‌కు షాక్‌ ఇచ్చింది.

పోల్‌లో ప్రస్తావించిన కీలక అంశాల్లో ఏ ఒక్క అంశాన్నీ ట్రంప్‌ సమర్ధంగా డీల్‌ చేస్తున్నారని ఓటర్లు చెప్పకపోవడం గమనార్హం. అయితే ఆర్థిక అంశాలు మాత్రం ట్రంప్‌ హయాంలో మెరుగయ్యాయని 36 శాతం​మంది అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు