సిగరెట్‌ మానేస్తే.. 6 అదనపు సెలవులు..

26 Nov, 2017 02:02 IST|Sakshi

ప్రతి కంపెనీలో సిగరెట్‌ తాగే వారు ఉంటారు.. తాగని వారూ ఉంటారు. కానీ మీరు పనిచేసే కంపెనీ ఎప్పుడైనా మీ సిగరెట్‌ అలవాటును మాన్పించేందుకు ప్రయత్నించిందా?? దాదాపుగా వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండే ప్రతి కంపెనీ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోకపోవచ్చు. కానీ జపాన్‌లోని టోక్యోకు చెందిన ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యమని భావించింది. అందుకే ఎవరైతే పొగ తాగడం మానేస్తారో వారికి ఏడాదిలో ఆరు పని దినాలను అదనంగా సెలవులుగా మంజూరు చేస్తామని ప్రకటించింది.

ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కంపెనీ పేరు పియాలా.ఐఎన్‌సీ... కంపెనీ కేంద్ర కార్యాలయం బిల్డింగ్‌లోని 29వ ఫ్లోర్‌లో ఉంటుంది. అంత పైనుంచి ఉద్యోగులు బిల్డింగ్‌ బేస్‌మెంట్‌లోకి వచ్చి సిగరెట్‌ తాగి వెళ్లడం వలన సుమారు 15 నిమిషాల సమయం వ్యర్థమైపోతోంది. దీనివల్ల పనిలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని సిగరెట్‌ తాగని ఒక ఉద్యోగి పేపర్‌పై రాసి సలహాల పెట్టెలో వేశాడు. దీన్ని చదివిన కంపెనీ సీఈవో పొగతాగని వారి కోసం ఆరు అదనపు సెలవులను ఇస్తే బాగుంటుందని భావించాడు.

అంతేకాకుండా ప్రాణాన్ని హరించే ఆ మహమ్మారి నుంచి ఉద్యోగులను కాపాడవచ్చని నిర్ణయించాడు. దీంతో వెంటనే ఈ ఆరు సెలవు దినాల కాన్సెప్ట్‌ను ప్రారంభించాడు.  ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది. 120 మంది ఉద్యోగుల్లో సుమారు 30 మంది ఆ కాన్సెప్ట్‌ను అందిపుచ్చుకుని ఇప్పటికే లబ్ధి పొందారు కూడా. కనీసం నలుగురినైనా సిగరెట్‌ అలవాటు నుంచి దూరం చేయాలని కంపెనీ ఉద్దేశాన్ని ప్రస్తుతం అక్కడి వారు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విమానం పైకెక్కి వ్యక్తి హల్‌చల్‌

మెక్సికన్‌ గల్ఫ్‌లో అరుదైన షార్క్‌ చేప..

సెలబ్రిటీల స్వర్గమేమో కదా అదీ!

పాక్‌ ప్రధానిని అవమానించిన అమెరికా

‘థ్యాంక్‌ గాడ్‌.. ఆ బాలుడు చేపకు చిక్కలేదు’

ఆ సరస్సులో దిగారా.. ఇక అంతే!

పాక్‌ ప్రధాని ప్రసంగం.. నినాదాలతో రచ్చరచ్చ!

ఇక ద్రవాలూ అయస్కాంతాలే!

కీళ్ల కదలికలతోనూ విద్యుత్తు...

మొసలికి చిప్‌..

నకిలీ ఉద్యోగాల ఉచ్చులో భారతీయులు

అమెరికాలో పూజారిపై దాడి

అమెరికా డ్రీమ్స్‌ కరిగిపోతాయా?

చైనా బలహీనతకు ట్రేడ్‌వార్‌ కారణమా?

అమెరికాలో స్వామీజీపై దాడి

జలుబు మంచిదే.. ఎందుకంటే!

వేడితో కరెంటు

ఆధిపత్యపోరులో భారతీయులు బందీలు

నాడూ రికార్డే.. నేడూ రికార్డే

ముసలి మొహం ప్రైవసీ మాయం!

వీవీఐపీ టాయిలెట్స్‌.. పేలుతున్న జోకులు

రూ.72 లక్షల జరిమానా.. జీవితకాల నిషేధం

ట్రంప్‌పై మిషెల్లీ ఒబామా ఆగ్రహం

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

ఆ మినిస్ట్రీ టాయిలెట్లకు బయోమెట్రిక్‌ మెషిన్లు! 

గతంలో కూడా అరెస్టయ్యాడు కదా: అమెరికా

పాక్‌కు భారీ నష్టం.. భారత్‌కు డబుల్‌ లాస్‌

ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ! 

ఆమె వచ్చింది.. అతన్ని చితక్కొట్టింది

ఫ్రెంచ్‌ కిస్‌తో డేంజర్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?