కరోనా: అద్భుతమైన వార్త.. మిరాకిల్‌ బేబీ

28 Apr, 2020 20:45 IST|Sakshi
ఎరిన్‌

గుండెలో సమస్య ఉన్నా కరోనా నుంచి కోలుకున్న బ్రిటన్‌ చిన్నారి

లండన్‌ : పుట్టుకతోటే గుండెలో సమస్య‌ ఉన్నప్పటికి ఓ ఆరు నెలల చిన్నారి కరోనా వైరస్‌ బారినుంచి కోలుకుంది. 14 రోజుల ఐసోలేషన్‌ తర్వాత పూర్తి ఆరోగ్యంగా బయటపడింది. ఈ సంఘటన బ్రిటన్‌లోని లివర్‌పూల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లివర్‌పూల్‌కు చెందిన ఎరిన్‌ అనే ఆరు నెలల చిన్నారికి తల్లి ద్వారా 14 రోజులక్రితం కరోనా సోకింది. దీంతో పాపను అక్కడి ‘ఆల్డర్‌ హే చిల్డ్రన్‌ ఆసుపత్రి’కి తరలించారు. 14రోజుల పాటు చిన్నారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించిన అనంతరం కరోనా నెగిటివ్‌ వచ్చింది. గుండె సంబంధిత సమస్య ఉన్నప్పటికి పాప కోలుకోవటంతో ఆసుపత్రి వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. ( ‌‘ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తున్న మొసలి’)

చప్పట్లతో శుభాకాంక్షలు తెలుపుతున్న వైద్యులు, వెంటిలేటర్‌ మీద ఉన్న చిన్నారి ఎరిన్‌

ఇందుకు సంబంధించిన వీడియోను ఆసుపత్రి వర్గాలు తమ ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నిజమైన యోధురాలు.. మిరాలిక్‌ బేబీ.. అద్భుతమైన వార్త ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎరిన్‌ త్వరగానే కోలుకున్నా తల్లి ఎమ్మా ఇంకా చికిత్స పొందుతుండటం గమనార్హం. ( మేమున్నాం: కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధుడు )

మరిన్ని వార్తలు