కరోనా లక్షణాలు దాస్తే 6నెలల జైలు శిక్ష

16 Mar, 2020 15:47 IST|Sakshi

కొలంబో: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలన్నీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగానే కొన్ని దేశాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే శ్రీలంక కూడా కరోనాను కట్టడి చేసే విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉండి వాటిని దాటిపెట్టినట్లు దొరికితే వాళ్లకు 6నెలల జైలు శిక్ష పడుతుందని శ్రీలంకకు చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు క్వారంటైన్ సెంటర్లకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారని ఆయన తెలిపారు. చదవండి: శ్రీలంకలో మొదటి కరోనా కేసు నమోదు

అలాంటి వ్యక్తుల వల్ల వైరస్ వ్యాప్తి చెంది పెద్ద అపాయం జరిగే అవకాశమున్నందున వారిని ఎటువంటి వారెంట్ లేకుండానే అరెస్ట్ చేస్తామని సీనియర్ ఇన్‌స్పెక్టర్, డీఐజీ అజిత్ రోహణ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఒక్కో పోలీస్ స్టేషన్ లో 7గురు అధికారులను నియమించామని, వారు క్వారంటైన్ నిబంధనల గురించి ప్రజలకు సమాచారం ఇస్తారని ఆయన తెలిపారు. కాగా.. శ్రీలంకలో ఇప్పటివరకు 18 కరోనా కేసులు నమోదు కాగా.. వారందరికీ కొలంబో సిటీ శివార్లలోని ఇన్ఫెక్షయస్ డిసీస్ హాస్పిటల్‌లో చికిత్సను అందిస్తున్నారు. చదవండి: కరోనా బారిన జేమ్స్‌బాండ్‌ నటి

మరిన్ని వార్తలు