మాస్క్ ధ‌రించ‌కుంటే రూ. 60,000 జ‌రిమానా

20 May, 2020 11:09 IST|Sakshi

దుబాయ్ :  క‌రోనా క‌ట్ట‌డికి ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా వైర‌స్ విజృంభిస్తూనే ఉంది. క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నా కొందరు అవేం ప‌ట్ట‌న‌ట్లు  వ్య‌వహరిస్తున్నారు. దీంతో దుబాయ్ ప్ర‌భుత్వం మ‌రిన్ని క‌ఠిన నిబంధ‌న‌ల‌కు చ‌ర్య‌లు తీసుకుంది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్ ధ‌రించ‌కుంటే 3,000వేల దిర్హామ్‌లు అంటే  అక్ష‌రాల 60,000 రూపాయల జ‌రిమానా విధిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అదే విధంగా క్వారంటైన్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే 10 లక్ష‌లు, ప‌లుమార్లు  ఉల్లంఘిస్తే 20 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానా విధిస్తామ‌ని పేర్కొంది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా క‌ట్ట‌డి దృష్ట్యావిధించిన జ‌రిమానాల్లో ఇదే అత్య‌ధికం.  (బ్రెజిల్‌ ప్రయాణాలపై నిషేధం‌: ట్రంప్‌ )

ఇక దేశంలో క‌రోనా నియంత్ర‌ణ‌కు విధించిన క‌ర్ఫ్యూను పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు ఉన్న క‌ర్ప్యూ రాత్రి 8 గంట‌ల నుంచే ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిపింది. క‌రోనా ప్ర‌భావాన్ని ముందే ప‌సిగ‌ట్టిన ప్ర‌భుత్వం..మార్చి19 నుంచే విదేశీయుల రాక‌పోక‌ల‌ను నిలిపివేసింది. అంతేకాకుండా దేశీయ విమానాల‌పై కూడా ఆంక్ష‌లు విధించింది. అయితే జూన్ 1 నుంచి విదేశాల్లో చిక్కుకున్న దుబాయ్ వాసుల‌ను దేశంలోకి అనుమ‌తిస్తామ‌ని అధికారులు వెల్ల‌డించారు. విదేశీయుల‌ను కూడా సాధ్య‌మైనంత తొంద‌ర‌గా ఆయా దేశాల‌కు పంపిస్తామని పేర్కొన్నారు. ఇక రంజాన్ సంద‌ర్భంగా ఉద‌యం 9 గంట‌ల నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు అన్ని మాల్స్ తెరుచుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఆ స‌మ‌యాల్లో రంజాన్ షాపింగ్ చేసుకోవ‌చ్చ‌ని పేర్కొంది. అయితే దుకాణాలు ఎక్కువ‌గా జ‌న‌సందోహం లేకుండా ప్ర‌తీ ఒక్క‌రూ నిబంధ‌న‌లు పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాల్సింగా య‌జ‌మానులకు సూచించింది. 
(క‌రోనా: బుర్జ్ ఖ‌లీఫా‌లో అమ్ముడుపోయిన‌ 12 ల‌క్ష‌ల లైట్లు ) 

>
మరిన్ని వార్తలు