నేపాల్ భూకంపంలో మరో 68 మంది మృతి

13 May, 2015 11:52 IST|Sakshi

చౌతరా(కఠ్మాండు): నేపాల్ లో మంగళవారం సంభవించిన భూకంపం వల్ల ఢోలఖా జిల్లాలో సూమారు 65 మంది ప్రజలు మృతిచెందారు. ఈ విషయాన్ని బుధవారం ఉదయం ఉత్తర కఠ్మాండుకు చెందిన అధికారి ప్రేమ్ లాల్ లామిచేన్ వెల్లడించారు. నేపాల్ ప్రజలను భూకంపం భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉంది. ప్రజలు భూకంపం సంభవిస్తుందేమోనన్న భయంతో వేలాది మంది మంగళవారం రాత్రి ఇంటి బయటే బిక్కుబిక్కుమంటూ గడిపారు. 3 వారాలకు ముందు సంభవించిన భూవిలయంలో సూమారు 8 వేల మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది.

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3 గా నమోదైంది. కఠ్మాండు, మౌంట్ ఎవరెస్టు మధ్య ప్రాంతం కేంద్రంగా ఈ భూకంపం సంభవించింది. బాధితులకు సహాయం అందించే ప్రయత్నంలో అమెరికాకు చెందిన హెలికాఫ్టర్ ఆరు మెరైన్లతో పాటు ఇద్దరు నేపాలీ సైనికులతో సహా ఈశాన్య నేపాల్ ప్రాంతంలో అదృశ్యమైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు