భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు

9 Aug, 2017 08:31 IST|Sakshi
భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు

చెంగ్ధూ: చైనాలోని సిచువాన్‌ ప్రావిన్సులో మంగళవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ మేరకు చైనా భూకంప కేంద్ర(సీఈఎన్‌సీ) ఓ ప్రకటన విడుదల చేసింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.0గా నమోదైనట్లు చెప్పింది. భూమి లోపల 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది.

భూకంప ధాటికి ఇళ్లు కూలిపోయినట్లు చైనా న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది.  దాదాపు వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది గాయాలపాలైనట్లు వెల్లడించింది. విపత్తు సంభవించిన ప్రాంతానికి చేరుకున్న సహాయక సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపింది. భూకంప తీవ్రత కేంద్రానికి 35 కిలోమీటర్ల పరిధిలో ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.