ఫిలిప్పైన్‌లో అగ్నిప్రమాదం; 72 మంది మృతి

15 May, 2015 00:53 IST|Sakshi

మనిలా: ఫిలిప్పైన్ రాజధాని మనిలాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 72 మంది మృత్యువాత పడ్డారు. మనిలా శివారులోని వాలెన్జులాలోని ఓ చెప్పుల ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. అగ్నికీలల్లో కార్మికులు చిక్కుకుని ప్రాణాలొదిలారు. గురువారం శిథిలాల్లో చిక్కుకున్న శవాలను అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు బయటకు తీశారు. చాలా శవాలు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. కొన్నింటికి పుర్రెలు, ఎముకలు కూడా లభించలేదు.

మరిన్ని వార్తలు