పోలీసులపై గ్రెనేడ్లు : ఘర్షణల్లో 22 మంది మృతి

11 May, 2015 02:58 IST|Sakshi
ఘర్షణల అనంతరం కుమనోవోలో పోలీసుల పహారా

కుమనోవో: మాసిడోనియా కుమనోవోలో ఆదివారం పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 8 మంది పోలీసులు, 14 మంది ఉగ్రవాదులు  మృతి చెందారు.  దేశ రాజధాని స్కోప్జీకి 40 కి.మీ. దూరంలో ఉన్న కుమనోవోలో నిన్నటి నుంచి సోమవారం ఉదయం వరకు సాగిన ఈ ఘర్షణల్లో 22 మంది చనిపోగా, 37 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. దుండగులు పోలీసులపై గ్రెనేడ్లు విసిరారు.  ఆటోమేటిక్ తుపాకులతో కాల్పులు జరిపారని హోం మంత్రి గోర్డానా జంకులోస్కా తెలిపారు.

పొరుగు దేశం నుంచి మాసిడోనియాలోకి చొరబడిన ఉగ్రవాదులను తరమికొట్టేందుకు దాడి చేశామని పోలీసులు చెప్పారు. దుండగులు పొరుగుదేశమైన కొసావో నుంచి వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

మరిన్ని వార్తలు