తన వంటలతో అదరగొడుతున్న చిన్నారి

1 Jun, 2020 15:26 IST|Sakshi

మయన్మార్‌: మో మైంట్ మే థు ఇప్పటి వరకు ఎవరికి తెలియని ఈ ఎనిమిదేళ్ల చిన్నారి పేరు ఇప్పుడు ఒక్కసారిగా  పాపులర్‌ అయిపోయింది. కరోనా కారణంగా ప్రపంచంలో చాలా దేశాలు లాక్‌డౌన్‌ విధించడంతో అందరూ దాదాపు ఇంటికే పరిమితమయిపోయారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది తమలో ఉన్న టాలెంట్‌ ఏంటా అని వెతికి మరీ పదునుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ చిన్నారి కూడా ఎనిమిదేళ్ల లేత ప్రాయంలోనే వంటకాలు చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. (రోనా: రోజుల డి కోమాలో శిశువు)

రొయ్యల కూర, కప్ప ఫ్రై, పోర్క్‌, టమాటాతో చేపల కూర ఇలా నోరూరించే రకరకాల కూరలు చేస్తూ అందరిని మంత్రముగ్థుల్ని చేస్తోంది. ఈ పాప రొయ్యల కూర చేసిన వీడియోను ఆమె తల్లి ఏ‍ప్రిల్‌లో ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసింది.  ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ‘లిటిల్‌ చెఫ్‌’ పేరుతో ఆన్‌లైన్‌లో పాపులర్‌ అయిపోయింది. ఈ విషయంపై మో మైంట్ మే థు మాట్లాడుతూ... ‘నాకు వంటచేయడం అంటే చాలా ఇష్టం’ అని తెలిపింది. ఇంకా తను కెరీర్‌ను కూడా ఆ దిశగానే ఎంచుకోవాలనుకుంటున్నట్లు కూడా తెలిపింది. (పావురం సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ అదిరింది)

ఈ పాప చేసిన ఒక వీడియోని 2,00,000 మంది వీక్షించారు. ఈ వీడియోలో మో మైంట్ మే థు మయన్మార్‌ ఫేవరెట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ మోహింగ్యా, బాయిల్డ్‌ కాట్‌ ఫిష్‌ ను తయారు చేసింది. ఇప్పుడు ఈ పాప చేసిన వంటకాల్ని 10,000క్యాత్‌లకు (7.20 డాలర్ల)కు విక్రయిస్తున్నారు. దీని గురించి ఆమె తల్లి హనీచో మాట్లాడుతూ... ప్రతి రోజు మో మైంట్‌ థు చేసిన వంటకాలను తమ కుటుంబం డెలివరీ చేస్తోందని తెలిపారు. అన్ని జాగ్రత్తలతో ఈ వంటకాలు చేస్తోన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మో మైంట్ మే థు తనకంటూ ప్రత్యేకమైన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకొని ఆ పేజీలో తన వంటకాలను పోస్ట్‌ చేస్తోంది. అయితే దీనిపై కొంత మంది నెటిజన్లు స్పందిస్తూ ఆమె వీడియోలను చూస్తుంటే తమని తాము మర్చిపోతున్నామని తెలిపారు.  మో మైంట్ మే థు ఆన్‌లైన్‌లో కుకింగ్‌ క్లాస్‌లు కూడా చెబుతోంది.

మరిన్ని వార్తలు