విమానం కూలి 9 మంది మృతి

26 Jun, 2015 12:39 IST|Sakshi

వాషింగ్టన్: అమెరికాలో విమానం కూలి 9 మంది మరణించారు. విహార యాత్ర కోసం వెళ్తుండగా అలెస్కా ఆగ్నేయ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు.

అత్యవసర బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. హాలెండ్ అమెరికా లైన్కు చెందిన ఈ సింగిల్ ఇంజిన్ విమానంలో ప్రయాణిస్తున్న వారందరూ మరణించినట్టు నిర్ధారించాయి. కాగా మృతదేహాలను తరలించేందుకు వాతావరణం ప్రతికూలంగా ఉన్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు