93 మదర్సాలకు ఉగ్రవాదులతో లింక్

26 Oct, 2016 18:47 IST|Sakshi
93 మదర్సాలకు ఉగ్రవాదులతో లింక్

కరాచీ: సింధ్ ప్రావిన్స్లో దాదాపు 93 మదర్సాలకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. అవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉగ్రవాద సంస్థలతో, పాక్లో నిషేధించిన తీవ్ర భావజాలం ఉన్న సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. దీంతో ప్రస్తుతం ఆ మదర్సాలన్నింటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సింధ్ ప్రాంత ముఖ్యమంత్రి మురాద్ అలీ షా రక్షణ బలగాలకు ఆదేశించినట్లు సమాచారం.

పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు సింధ్ ప్రావిన్స్లోని పరిస్థితులపై సర్వే చేయగా అక్కడి కొన్ని మదర్సాలు ఉగ్రవాదానికి హబ్ లుగా మారాయని గుర్తించి ఆ విషయాన్ని ముఖ్యమంత్రి మురాద్ కు వివరించాయి. దీంతో ఈ అంశంపై ప్రత్యేకంగా మంగళవారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.దీనికి పాక్ రేంజర్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బిలాల్ అక్బర్, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. వీరంతా కలిసి మదర్సాలు చేస్తున్న చర్యలను తీవ్ర ఖండించారు. అలాంటి వాటిని ఏమాత్రం ప్రోత్సహించరాదని, వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని ఆ సమావేశంలో రక్షణ బలగాల అధికారులకు సీఎం ఆదేశించారు. త్వరలోనే అలాంటి మదర్సాలపై చర్యలు ప్రారంభం కానున్నాయి.

మరిన్ని వార్తలు