బాంబు బెదిరింపు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!

31 Dec, 2016 11:26 IST|Sakshi
బాంబు బెదిరింపు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!

ప్రేగ్ (చెక్ రిపబ్లిక్): బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో అత్యవసరంగా ఓ విమానాన్ని ల్యాండ్ చేయాల్సి వచ్చింది. మరో ముఖ్య విషమేమంటే.. ప్యాసింజర్ ఈ చర్యకు పాల్పడ్డాడని చెక్ రిపబ్లిక్ అధికారులు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. బోయింగ్ 707 విమానం లాస్ పల్మాస్(స్పెయిన్) నుంచి వార్సాకు వెళ్తుంది. అయితే ప్రేగ్ సమీపానికి రాగానే విమానంలో బాంబు ఉందని శుక్రవారం రాత్రి విమాన సిబ్బందికి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది బోయింగ్ విమానాన్ని ప్రేగ్ లోని వక్లవ్ హవెల్ ఎయిర్ పోర్టు సమీపంలోని వాడకంలో లేని మరో ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. అందులో ఉన్న 160 మంది ప్రయాణికులను దించివేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

పోలాండ్‌కు చెందిన ఓ ప్యాసింజర్ ఈ ఫోన్ కాల్ చేసినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విమాన ప్రయాణికులు రాత్రి ఆ ఎయిర్ పోర్టులో గడిపారు. తిరిగి శనివారం ఉదయం ప్రయాణికులను అదే విమానంలో వార్సాకు వెళ్లే ఏర్పాట్లుచేశారు. మరోవైపు పోలాండ్ ప్రయాణికుడు ఎందుకు బెదిరింపు కాల్ చేశాడు అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రయాణికుడి వివరాలను విమాన సిబ్బంది వెల్లడించలేదు.

మరిన్ని వార్తలు