'గే' అని కుమారుడిని కాల్చేశాడు!

3 Apr, 2016 10:14 IST|Sakshi
'గే' అని కుమారుడిని కాల్చేశాడు!

లాస్ ఎంజెల్స్: కొడుకు స్వలింగ సంపర్కుడు (గే) అన్న విషయాన్ని భరించలేని ఓ తండ్రి కోపోద్రిక్తుడయ్యాడు. ఆ కోపంలో కుమారుడిపై కాల్పులు జరిపి చంపేశాడు. ఈ ఘటన లాస్ ఎంజెల్స్ లో ఇటీవల చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. షెహాదా ఇస్సా(69), అమిర్ ఇస్సా(29) తండ్రీకొడుకులు. ఏమైందో తెలియదు కానీ కుమారుడ్ని తుపాకీతో కాల్చి చంపేశాడు. పోలీసులు షెహాదాను అరెస్ట్ చేసి విచారణ జరిపగా, తన భార్యను కుమారుడు చంపాడని ఆరోపించాడు. తనను చంపుతానని పలుమార్లు బెదించాడని చెప్పుకొచ్చాడు.

భార్య రబిహా ఇస్సా(68) మృతదేహాన్ని ఇంటి ఆవరణలో గుర్తించిన తర్వాత కుమారుడిపై అనుమానం వచ్చిందని చెప్పాడు. తనను కూడా చంపేస్తాడేమోనని భావించి అమిర్ ను తానే చంపానని ఒప్పుకున్నాడు. అసలు ట్విస్ట్ విచారణలో తేలింది. పోలీసులు పదే పదే ప్రశ్నిస్తుండగా హెహాదా జవాబులు మార్చి చెబుతున్నాడు. అతడి వైఖరిలో మార్పును గమనించిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు నిజాల్ని బయటపెట్టాడు. కుమారుడు గే అయినందువల్ల ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో కాల్చి చంపేశానని పోలీసులకు వివరించాడు.  
 

మరిన్ని వార్తలు