మృత్యువు అంచుల దాకా వెళ్ళి...

17 Feb, 2015 15:46 IST|Sakshi

ఆక్ లాండ్: మృత్యువు అంచుల దాకా వెళ్ళిన ఒక మహిళను న్యూజిలాండ్ పోలీసులు అత్యంత సాహసోపేతంగా, చాకచక్యంగా రక్షించారు.  ఆక్ లాండ్ లోని వైట మెటా హార్బర్ లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆక్ లాండ్ హార్బర్ లోకి  సడన్ గా ఒక బియండబ్ల్యూ కారు వేగంగా దూసుకొచ్చింది. ఊహించని వేగంతో నీళ్లలో మునిగిపోతోంది. అంతే, కారు డ్రైవింగ్ చేస్తున్న మహిళ భయంతో అరవడం మొదలుపెట్టింది.  దీన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్కు చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించే పనిలో పడ్డారు.

నీళ్లలోకి  దూకిన ఇద్దరు పోలీసులు కారు డోర్స్  ఓపెన్  చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ   సాధ్యంకాలేదు. ఒక పక్క కారుతో పాటు ఆ మహిళ మునిగిపోతోంది. ఇక కారు డోర్లు ఓపెన్ కావని తేలిపోయింది. అంతే పోలీసు మదిలో ఒక ఐడియా తళుక్కున మెరిసింది. పక్కనే  ఉన్న రాయిని తీసుకుని విండ్ స్క్రీన్ గ్లాస్ను పగులగొట్టి మహిళను  బయటికి లాగారు.  దీనితో కథ సుఖాంతమైంది.


>
మరిన్ని వార్తలు