కరాచీ మ్యూజియంలో అభినందన్‌ బొమ్మ

10 Nov, 2019 14:16 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : బాలాకోట్‌ వైమానిక దాడి అనంతరం జరిగిన పరిణామాల్లో పాక్‌ యుద్ధ విమానాలను తరుముకుంటూ పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పట్టుబడిన వైమానిక దళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ బొమ్మను పాకిస్తాన్‌ వైమానిక దళ కేంద్ర స్థానమైన కరాచీలోని మ్యూజియంలో పెట్టుకున్నారు. ఈ విషయాన్ని పాక్‌ జర్నలిస్టు అన్వర్‌ లోధీ శనివారం అర్ధరాత్రి తన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అభినందన్‌ బొమ్మ పెట్టడం గమనార్హం. అయితే బొమ్మను ఏ ఉద్దేశ్యంతో పెట్టారో అన్వర్‌ వెల్లడించలేదు. అంతేకాక, అభినందన్‌ బొమ్మ చేతిలో టీ కప్పు పెడితే ఇంకా బాగుండేదని సరదాగా వ్యాఖ్యానించారు. 

>
మరిన్ని వార్తలు