120 తుపాకులు.. 160 కత్తులు!

21 May, 2015 09:35 IST|Sakshi
కాల్నుల్లో చోటు చేసుకున్న ట్వీన్ పీక్స్ రెస్టారెంట్ ప్రాంతం

ఆస్టిన్:గత  నాలుగు రోజుల క్రితం టెక్సాస్ నగరంలోని వాకా వద్ద బైక్ గ్యాంగ్ ల మధ్య చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆ గ్యాంగ్ సభ్యులు తమ వెంట తుపాకులు, కత్తులతో పాటు పలు మారణాయుధాలను భారీ స్థాయిలో వెంటబెట్టుకురావడం పలు అనుమానాలకు తావిస్తోంది.  ముందస్తు ప్రణాళికలో భాగంగానే వారు తమ వెంట ఆయుధాలను తీసుకొచ్చి భారీ విధ్వంసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఆ ప్రాంతంలో120 తుపాకీలు.. 160 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఇందుకు మరింత ఊతం ఇస్తోంది.  ఆదివారం ట్విన్‌పీక్స్ రెస్టారెంట్‌లో జరిగిన ఆ భేటీలో ఐదు బైక్ గ్యాంగ్‌లకు చెందిన సభ్యుల మధ్య కాల్పులు జరిగి తొమ్మిది మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
 

 

టెక్సాస్ పోలీసులకు ఛాలెంజ్ గా మారిన ఈ కేసులో ఇప్పటివరకూ 320 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, వెయ్యికి పైగా ఆయుధాలను ఆ స్థలంలో దొరికినట్లు టెక్సాస్ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ఆ దాడి అనంతరం స్థానికంగా మూసుకున్న షాపులను తిరిగి బుధవారం తెరిచారు.

మరిన్ని వార్తలు