యువరాజు షేక్‌హ్యాండ్‌ ఇవ్వలేదు.. అంతకు మించి

4 Dec, 2019 09:35 IST|Sakshi
ఐశా మహమ్మద్‌ మషీత్‌ అల్‌ మజ్‌రౌవీతో అబుదాబీ ప్రిన్స్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌

అబుదాబి : అబుదాబి యువరాజు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ కొద్దిరోజుల క్రితం ఓ విందులో పాల్గొన్నారు. ఈ విషయం తెలిసిన స్థానిక ప్రజలు అతని షేక్‌హ్యాండ్‌ కోసం బారులు తీరారు. ఇంతలో ఓ చిన్నారి పరుగు పరుగున వచ్చి ఆ లైన్‌లో నిలబడింది. అతని కోసం చేతులు ముందుకు చాచి ఆతృతగా ఎదురు చూడసాగింది. అందరికీ చిరునవ్వుతో కరచాలనం చేస్తూ వచ్చిన యువరాజు చివరకు ఆ చిన్నారికి షేక్‌హ్యాండ్‌ ఇవ్వకుండానే వెళ్లిపోయాడు.

దీంతో బాలిక తీవ్ర నిరాశకు గురైంది. తనవంతు రాగానే యువరాజు షేక్‌హ్యాండ్‌ ఇవ్వలేదని ఎంతగానో బాధపడింది. అయితే ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో వెంటనే ఆ యువరాజు చిన్నారి ఐశా మహమ్మద్‌ మషీత్‌ అల్‌ మజ్‌రౌవీ ఇంటికి వెళ్లి సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాడు. చిన్నారితో కరచాలనం చేయడమే కాకుండా నుదుటిపై ఆత్మీయంగా ముద్దు పెట్టాడు. దీంతో బాలిక ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యువరాజుది గొప్ప మనసు అంటూ ఆయన చేసిన పనికి నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు