అతను నన్ను దారుణంగా రేప్‌ చేశాడు : హాలీవుడ్‌ నటి

24 Jan, 2020 09:35 IST|Sakshi

న్యూయార్క్‌ : 25 ఏళ్ల క్రితం మూవీ డైరెక్టర్‌ హార్వే వెయిన్‌స్టీన్‌ తనను అతి దారుణంగా రేప్‌ చేశాడంటూ హాలీవుడ్‌ నటి అన్నాబెల్లా సియోరా గురువారం కోర్టు హాలులో భావోద్వేగానికి లోనయ్యారు. కోర్టు హాలులో జడ్జి జోన్‌ లూజీ ఓర్బన్‌ ఎదుట తన వాదనను చెప్పుకొని కన్నీటి పర్యంతమయ్యారు. నటి అన్నాబెల్లాను దారుణంగా రేప్‌ చేశాడన్న ఆరోపణలతో అప్పట్లోనే వెయిన్‌స్టీన్‌పై కేసు నమోదైంది. కానీ ఇంతవరకు ఈ కేసులో సరైన నిజాలు లేకపోవడంతో 25 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి వాదనకు వచ్చిన కేసులో అన్నా తన వాదనలు వినిపించారు.

'1994లో సినిమా షూటింగ్‌ ఆలస్యం కావడంతో డైరెక్టర్‌ హార్వే తన కారులో దింపుతానని నన్ను ఎక్కించుకున్నాడు. న్యూయార్క్‌లోని మహట్టన్‌ అపార్ట్‌మెంట్‌ దగ్గర దింపేసి వెళ్లిపోయాడు. తర్వాత నేను పడుకోవడానికి సిద్దమవుతుండగా డోర్‌ తలుపును ఎవరో కొట్టినట్లు అనిపించింది. డోర్‌ తెలిచి చూడగానే డైరెక్టర్‌ హార్వే ఎదురుగా నిలబడి ఉన్నాడు. అతని ప్రవర్తన నాకు ఏదో అనుమానంగా కనిపించింది. ఆ సమయంలో నా శరీరం మొత్తం వణుకు పుట్టింది. అయినా దైర్యం తెచ్చుకొని ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అనేలోపే హార్వే నన్ను బలవంతం చేయబోయారు. నేను వద్దని వారించినా వినకుండా బెడ్‌రూంలోకి ఈడ్చుకెళ్లాడు. అతన్ని వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో నా చేతులను మంచానికి కట్టేసి దారుణంగా రేప్‌ చేశారు. నిజంగా ఆ రాత్రి నాకు కాళరాత్రిగా మిగిలిపోయింది. వెయిన్‌స్టీన​ చేసిన పని నా జీవితంలో ఒక చేదు ఘటనగా మిగిలిపోయింది. ఇన్ని సంవత‍్సరాలైనా ఆ రాత్రి జరిగిన ఘటన ఇప్పటికి గుర్తుందంటూ' 59 ఏళ్ల అన్నాబెల్లా సియోరా చెప్పుకొచ్చారు.

అయితే అన్నా తన వాదనలు వినిపిస్తున్న సమయంలో హార్వే వెయిన్‌స్టీన్‌ కోర్టు హాలులోనే ఉండడం గమనార్హం. ఆ సమయంలో హార్వే మొహం ఎలాంటి ఆందోళన కనిపించలేదు. దీంతో పాటు వెయిన్‌స్టీన్‌ 80 మందిని లైంగికంగా వేదించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.అందులో హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలీ పేరు కూడా ఉండడం విశేషం. కాగా అన్నా వాదనల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయనేది తేల్చడానికి శుక్రవారం  సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ను రప్పించాలని కోర్టు ఆదేశించింది.

మరిన్ని వార్తలు