గ్రామీ అవార్డుల్లో అడెలె హవా

13 Feb, 2017 11:51 IST|Sakshi
గ్రామీ అవార్డుల్లో అడెలె హవా

లాస్‌ఏంజిల్స్: సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘గ్రామీ’  పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. 59వ ‘గ్రామీ’ అవార్డుల్లో పాప్‌ సింగర్‌ అడెలె ఐదు అవార్డులు గెలుపొంది సత్తాచాటారు. ఆమెకు ఆల్బమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌(25), రికార్డ్‌ ఆఫ్‌ ద ఇయర్‌(హలో), సాంగ్‌ ఆఫ్‌ ద ఇయర్‌(హలో) అవార్డులతో పాటు.. బెస్ట్‌ పాప్‌ సోలో పర్ఫామెన్స్‌, బెస్ట్‌ పాప్‌ ఓకల్‌ ఆల్బమ్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు.

9 విభాగాల్లో నామినేషన్‌ పొందిన బియోన్స్‌.. బెస్ట్‌ మ్యూజిక్‌ వీడియో, కాంటెంపరరీ ఆల్బమ్‌ అవార్డులను గెలుచుకున్నారు. డేవిడ్‌ బొవీకి నాలుగు పురస్కారాలు దక్కాయి. ఉత్తమ రాక్‌ సాంగ్‌(బ్లాక్‌స్టార్‌), ఉత్తమ రాక్‌ పర్ఫామెన్స్‌(బ్లాక్‌స్టార్‌) అవార్డులు డేవిడ్‌ బొవీకి దక్కాయి.

మరిన్ని వార్తలు