ఉత్తర కొరియా అత్యాధునిక రాకెట్‌ పరీక్ష

20 Mar, 2017 01:03 IST|Sakshi
ఉత్తర కొరియా అత్యాధునిక రాకెట్‌ పరీక్ష

పరీక్షకు హాజరైన దేశాధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్‌

టోక్యో: ఉత్తర కొరియా సోహేలో శనివారం అత్యాధునిక రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షకు ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ అత్యాధునిక రాకెట్‌ పరీక్షతో దేశ అంతరిక్ష కార్యక్రమం విప్లవాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. ఈ రోజు ఉత్తర కొరియా సాధించిన విజయాన్ని ప్రపంచమంతా చూసిందని..స్వదేశీ రాకెట్‌ పరిశ్రమలో మార్చి 18 ని విప్లవాత్మకమైన రోజుగా  అభివర్ణించారు.

ఈ క్షిపణి పరీక్ష విజయం పట్ల ఆ దేశ మీడియా స్వదేశీ రాకెట్‌ పరిశ్రమను ఆకాశానికెత్తేసింది. గత రాకెట్‌ ఇంజిన్‌ల కంటే కచ్చితమైన, సురక్షితమైన నియంత్రణ వ్యవస్థను కలిగి ఉండటం ఈ రాకెట్‌ ప్రత్యేకతలు. పంచవర్ష ప్రణాళికలో భాగంగా భవిష్యత్తులో మరిన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు, వచ్చే పదేళ్లలో చంద్రుడి వద్దకు ఉపగ్రహాన్ని పంపించేందుకు ఇటువంటి అత్యాధు నిక రాకెట్‌లు అవసరమవుతాయని ఉత్తర కొరియా అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు