తాలిబన్లు పరుగో.. పరుగు

28 Oct, 2015 18:17 IST|Sakshi
తాలిబన్లు పరుగో.. పరుగు

కాబూల్: అఫ్గనిస్థాన్ సేనలు బుధవారం తాలిబన్ ఉగ్రవాదుల నివాస స్థావరాన్ని గుర్తించారు. తజకిస్థాన్ తో సరిహద్దు కలిగి ఉన్న కుందు ప్రావిన్స్ లోని దషత్ ఈ ఆర్చి జిల్లాలోని ఓ చోట తాలిబన్ ఉగ్రవాదులను అఫ్గన్ సైన్యం గుర్తించింది. దీంతో వారి అలికడి విన్న తాలిబన్లు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దాదాపు 40మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ చుట్టుపక్కల ప్రతి ఇంటిని గాలించారు. జిల్లా మొత్తాన్ని వడపోశారు.

ఓ రకంగా ఈ జిల్లా తాలిబన్ ఉగ్రవాదులకు కీలక స్థావరం గత రెండేళ్లలో ఎన్నిసార్లు ప్రయత్నించినా అఫ్గన్ సేనలు అక్కడికి వెళ్లలేకపోయాయి. ఇటీవలే కొన్ని వ్యూహాలతో ముందుకు కదిలిన ఆఫ్గన్ సైన్యం ఎట్టకేలకు ఉగ్రవాదుల అసలైన స్థావరాలను గుర్తించి వారికి ముచ్చెమటలు పట్టించింది. ఇటీవల తాలిబన్లు అఫ్గన్ సేనలపై విచక్షణా రహితంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంది. 

మరిన్ని వార్తలు