ఆ ‘అఫ్గాన్ అమ్మాయి’ అరెస్టు

27 Oct, 2016 08:16 IST|Sakshi
ఆ ‘అఫ్గాన్ అమ్మాయి’ అరెస్టు

పెషావర్: 1984లలో అఫ్గాన్ వలసలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆకుపచ్చ కళ్ల ‘అఫ్గాన్ బాలిక’ షర్బత్ గులాను బుధవారం పాకిస్తాన్‌లో నకిలీ గుర్తింపు కార్డు కలిగి ఉన్న ఆరోపణలపై అరెస్టు చేశారు. అఫ్గానిస్తాన్‌కు చెందిన గులాకు 12 ఏళ్లు ఉన్నపుడు 1985లో నేషనల్ జియోగ్రఫిక్ మేగజీన్ తన కవర్‌పేజీపై ఈమె ఫొటోను ప్రచురించింది. దీంతో గులా ప్రపంచం దృష్టిలో పడింది. ‘మొనాలిసా ఆఫ్ ఆఫ్గాన్’గా ఘనత సాధించింది. శరణార్థుల శిబిరంలో స్టీవ్ మెక్‌కర్రీ అనే ఫొటోగ్రాఫర్ ఈ ఫొటో తీశారు.

ఇప్పుడు ఆమె పాక్‌లోని పెషావర్ దగ్గర్లోని నోథియాలో ఉంటున్నారు. పాక్‌లో తలదాచుకుంటున్న వేలాది మంది అఫ్గాన్ శరణార్థుల్లో గులా ఒకరు. గులా 2014లో పాక్ గుర్తింపు కార్డు కోసం షర్బత్ బీబీ పేరుతో దరఖాస్తు చేసుకుందని అధికారులు నిర్ధారించారు. పాక్‌కు వలసవచ్చిన గులా పాకిస్తానీని వివాహమాడింది. ఆమెకు ముగ్గురు పిల్లలు.

మరిన్ని వార్తలు