ఎబోలాతో ఉత్తరాఫ్రికా ఆర్థిక వ్యవస్థ కుదేలు

25 Aug, 2014 02:51 IST|Sakshi
ఎబోలాతో ఉత్తరాఫ్రికా ఆర్థిక వ్యవస్థ కుదేలు

మొన్రోవియా(లైబీరియా): ఉత్తరాఫ్రికాను వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి ఎబోలా అక్కడి లైబీరియా, సియోర్రాలిన్, గినియా తదితర దేశాల ఆర్థిక వ్యవస్థలనూ తీవ్రంగా దెబ్బతీస్తోంది. చెమట, రక్తం తదితర శరీర ద్రవాల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి కార్మికులకు సోకుతుందనే భయంతో పలు కంపెనీలను మూసేస్తున్నారు.

గనులు కూడా మూతపడుతున్నాయి. కూలీలు పొలాలకు వెళ్లకపోవడంతో పంటలు పొలాల్లోనే నాశనమవుతున్నాయి. కాగా,  సియెర్రా లియోన్‌లోని  ఒక బ్రిటిష్ ఆరోగ్య కార్యకర్తకు, ప్రపంచ   ఆరోగ్య సంస్థ వైద్యనిపుణుడికి ఎబోలా సోకింది.
 
 

>
మరిన్ని వార్తలు