18 ఏళ్ల తర్వాత దొరికింది..!

7 Dec, 2014 02:47 IST|Sakshi
18 ఏళ్ల తర్వాత దొరికింది..!

 పోగొట్టుకున్న వస్తువు తిరిగి దొరికితే కలిగే ఆనందమే వేరు. అలాంటిది.. పోగొట్టుకున్న 18 ఏళ్ల తర్వాత దొరికితే ఏ విధంగా ఉంటుంది? బ్రిటన్‌కు చెందిన కొలిన్ మెండోజా 1996లో జ్యూరిచ్ నుంచి జెనీవా వెళుతున్నప్పుడు ట్రైన్‌లో తన వ్యాలెట్ పోగొట్టుకున్నాడు. అందులో పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్‌తోపాటు క్రెడిట్ కార్డులు, కొన్ని రసీదులు ఉన్నాయి. తర్వాత తన వ్యాలెట్ పోయిన విషయాన్ని గుర్తించిన కొలిన్.. పోలీసులకు ఫిర్యాదు చేసి, తర్వాత ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కొత్త పాస్‌పోర్టు తీసుకున్నాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. కొలిన్ వ్యాలెట్ సంగతే మరిచిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు.

ఈ తరుణంలో 18 ఏళ్ల తర్వాత స్విట్జర్లాండ్‌లోని ఓ పోలీసు అధికారి నుంచి అతడికి మెయిల్ వచ్చింది. చర్‌లోని ఓ మాల్‌లో తన వ్యాలెట్ దొరికిందన్నది దాని సారాంశం. సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ద్వారా కొలిన్ మెయిల్‌కు ఆ పోలీసు అధికారి వ్యాలెట్ విషయాన్ని తెలియజేశాడు. ఆ మెయిల్ చూసిన కొలిన్ సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు. అనంతరం అక్కడకు వెళ్లి వ్యాలెట్‌ను చూడగా, పాస్‌పోర్టుతో సహా అన్నీ అలాగే ఉన్నాయి. తన భార్య బహుమతిగా ఇచ్చిన వ్యాలెట్ తిరిగి దొరకడంతో అతడి ఆనందానికి అవధుల్లేవు.

మరిన్ని వార్తలు