పాక్లో ప్రతిపక్ష పార్టీలకు షాక్

27 Oct, 2016 15:54 IST|Sakshi
పాక్లో ప్రతిపక్ష పార్టీలకు షాక్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో తాజాగా నిషేధాజ్ఞలు విధించారు. దాదాపు రెండు నెలలపాటు ఏ రాజకీయ పార్టీ సమావేశాలు, సభలు, బహిరంగ కార్యక్రమాలు, ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించొద్దంటూ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉల్లంఘించిన వారిని జైలులో పెడతామని హెచ్చరించారు. ప్రధాని నవాజ్ షరీఫ్కు వ్యతిరేకంగా అతిత్వరలోనే ఆందోళనలు నిర్వహిస్తామని, ఎక్కడికక్కడ రాజధాని ప్రాంతంలో పూర్తిస్థాయి బంద్లు నిర్వహిస్తామని ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించిన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం తరుపున ఈ ఆదేశాలిచ్చారు.

నవాజ్ షరీఫ్ పదవి నుంచి దిగిపోయే వరకు తమ ఆందోళన ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. పనామా విడుదల చేసిన పత్రాల ఆధారంగా షరీఫ్కు ఆయన కుటుంబానికి భారీ మొత్తంలో అక్రమ ఆస్తులు ఉన్నాయని, వాటిని రక్షించుకునే పనిలో పడి దేశాన్ని గాలికి వదిలేశారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆయన వెంటనే దిగిపోవాలని, లేదంటే దిగిపోయేవరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు