మట్టి లేకుండానే వ్యవసాయం..

7 Nov, 2016 03:48 IST|Sakshi
మట్టి లేకుండానే వ్యవసాయం..

అలస్కా : వ్యవసాయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. కొందరు ఆరు బయట పొలాల్లో సాగు చేస్తే మరికొందరు గ్రీన్‌హౌస్‌లో చేస్తారు. ఏది ఏమైనా వ్యవసాయం చేయాలంటే మాత్రం మట్టి(నేల) కావాల్సిందే. కానీ అలస్కాలోని కొందరు మట్టి అవసరం లేకుండానే సాగు చేస్తున్నారు. ఈ విచిత్రమైన సాగు పేరు వర్టికల్ ఫార్మింగ్. దీనికి హైడ్రోపోనిక్ ఫార్మ్ అని మరోపేరు కూడా ఉంది. అలస్కాలోని కోట్జెబు నగరంలోని కొందరు ఈ విధమైన సాగు పద్ధతిని అవలంబిస్తున్నారు. ఈ వర్టికల్ ఫార్మింగ్ ద్వారా ఒక కంటైనర్‌లో తాజా కూరగాయలను పెంచుతున్నారు.

రాక్ ఊల్ (దూది బెండు)పై ఈ మొక్కలను పెంచుతున్నారు. మొక్కకు కావాల్సిన నీరు, పోషకాలు బయట నుంచి ఇస్తే సరిపోతుంది. ఇక సూర్యకాంతి కావాలి కదా! దానికోసం ఎల్‌ఈడీ కాంతులను వినియోగిస్తున్నారు. ఇందులో దిగుబడి కూడా అధికంగా వస్తుంద అక్కడి వారు చెబుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు