వారికి ఎయిడ్స్ సోకదు!

7 Oct, 2016 07:08 IST|Sakshi
వారికి ఎయిడ్స్ సోకదు!

విల్నియస్: ఎయిడ్స్.. ఇదో ప్రాణాంతక వ్యాధి. అయితే లిథువేనియా దేశానికి చెందిన కొందరికి మాత్రం ఎయిడ్స్ అంటే అస్సలు భయమే లేదు. ఎందుకంటే వారికి ఎయిడ్స్ అసలే సోకదు. హెచ్‌ఐవీ వైరస్ వారి శరీరంలోకి ప్రవేశించినా కూడా వారికి ఏమీ కాదని శాస్త్రవేత్తలు తేల్చేశారు. లిథువేనియా ప్రజల్లో దాదాపు 16 శాతం మందికి ఎయిడ్స్ నిరోధకత కలిగి ఉందని చెబుతున్నారు.

ఎందుకంటే వారి జన్యువులు పలు పరివర్తనాలు (జీన్ మ్యుటేషన్) చెందడం వల్ల వారి నిరోధక వ్యవస్థలోకి ఎయిడ్స్ వైరస్ ప్రవేశించి నాశనం చేయలేదని వెల్లడించారు. వీరి జన్యువులను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలకు ఎయిడ్స్ వ్యాధి చికిత్స పద్ధతులు తెలుసుకునే అవకాశం కలగనుంది.

మరిన్ని వార్తలు