-

నీలినింగిలో షి‘కార్లు’...

8 Jul, 2014 02:56 IST|Sakshi
నీలినింగిలో షి‘కార్లు’...

ఈ కార్ల విన్యాసాలు చూసి ఒళ్లు గగుర్పొడుస్తుందా? అలా గాలిలోకి దూసుకుపోతున్న కార్లు సురక్షితంగా కిందకు ఎలా వస్తాయా అని ఆలోచిస్తున్నారా? అస్సలు ఆలోచించకండి.. ఎందుకంటే అవి కిందకు రావు.. అక్కడే అలాగే ఉంటాయి! ఔను.. నిజం.. అవి నిజమైన వాహనాలు కావు. బ్రిటన్‌లోని ఎస్సెక్స్‌లో ప్రతి ఏటా ‘గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్’ పేరుతో ఓ వేడుక నిర్వహిస్తారు.

అందులో జెర్రీ జుదా అనే శిల్పకళా నిపుణుడు నిజమైన కార్లే పోటీపడుతున్నట్టుగా చిత్రవిచిత్ర ఆకారాల్లో ఇలాంటి నిర్మాణాలు రూపొందిస్తుంటాడు. ఇవన్నీ ఒక్కో ఏడాది అతడు రూపొందించిన కళాత్మక కట్టడాలు. బావున్నాయి కదూ..!
 

మరిన్ని వార్తలు