బాంబులు పేలుతున్నా వెనక్కి తగ్గలేదు

23 Mar, 2016 20:10 IST|Sakshi
బాంబులు పేలుతున్నా వెనక్కి తగ్గలేదు

బ్రెస్సెల్స్: ఉగ్రవాదులు బాంబులు పేల్చుతున్నా లెక్కచేయకుండా ఎయిర్ పోర్ట్ ఉద్యోగి 7 మందిని కాపాడాడు. ఎయిర్ పోర్ట్ ఉద్యోగి అల్ఫాన్సో యౌలా ఒక్కసారిగా బ్రస్సెల్స్ హీరోగా మారిపోయాడు. బ్రస్సెల్స్లోని జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ వద్ద రెండు చోట్ల, పక్కనే రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం మరో పేలుడు సంభవించాయి. ఈ ఘటనలలో కనీసం 30 మంది మరణించగా, మరో 35 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. సెక్యూరిటీ గార్డుగా, లగేజీ గార్డుగా అల్ఫాన్సో పనిచేస్తుంటాడు. బాంబులు పేలుతున్న సమయంలో ఎయిర్ పోర్టు చెక్ ఇన్ డెస్క్ వద్ద ఉన్నాడు.

బాంబు పేలుడు శబ్ధం విన్న వెంటనే అక్కడికి వెళ్లి ఏడుగురు ప్రయాణికుల్ని ఆ దాడుల నుంచి రక్షించాడు. డిపార్చర్ విభాగం వద్ద రెండు బాంబులు పేలిన వెంటనే స్పందించిన ఆ ఉద్యోగి స్వల్ప గాయాలపాలైన ఏడుగురిని అక్కడి నుంచి సురక్షిత ప్రారంతానికి తీసుకెళ్లి వారి ప్రాణాలను నిలబెట్టాడు. కొద్ది క్షణాల్లోనే ఎయిర్ పోర్టు రక్తసిక్తమైందని, తనకు దగ్గర్లో ఉన్న ఓ వ్యక్తి తన రెండు కాళ్లను కోల్పోయాడని, ఓ పోలీస్ కూడా తీవ్రంగా గాయపడ్డాడని ఇంటర్వ్యూలో తెలిపాడు. చనిపోయిన 5 మంది వ్యక్తుల మృతదేహాలను బయటకు తీశానని ఆ దుర్ఘటన గురించి వివరించాడు.

మరిన్ని వార్తలు