మందేస్తే.. లాంగ్వేజ్‌ సూపర్‌!

23 Oct, 2017 01:50 IST|Sakshi

లండన్‌: పరిమిత స్థాయిలో మద్యం సేవించేవారిలో విదేశీ భాషలో మాట్లాడే సామర్థ్యం మెరుగవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. నెదర్లాండ్‌లోని మాస్ట్రిచ్‌ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్‌ లివర్‌పూర్, లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇటీవల డచ్‌ నేర్చుకున్న 50 మంది జర్మన్లను ఎంపిక చేశారు. ఒక్కొక్కరి శరీర బరువును బట్టి మద్యం డోస్‌ను నిర్ధారించారు.

ఈ అభ్యర్థుల భాషా ప్రావీణ్యాన్ని గుర్తించేందుకు ఇద్దరు డచ్‌ పౌరుల్ని ఎంపిక చేశారు. అంతేకాకుండా తమ భాషా నైపుణ్యానికి మార్కులు ఇచ్చుకోవాల్సిందిగా అభ్యర్థులకు పరిశోధకులు సూచించారు. అయితే ఈ వ్యక్తులు మద్యం సేవించిన విషయాన్ని మాత్రం ఇద్దరు డచ్‌ పరిశీలకులకు తెలియజేయలేదు. పరిమిత స్థాయిలో మద్యం సేవించిన వ్యక్తులు మద్యం తాగని వారితో పోల్చుకుంటే డచ్‌ భాషను మాట్లాటడంలో ఎంతో మెరుగ్గా వ్యవహరించారని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మరిన్ని వార్తలు