‘ఇప్పుడే పాకిస్తాన్‌ వదిలి పారిపోండి’

30 Oct, 2019 15:09 IST|Sakshi

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌ విషయంలో భారత్‌కు అండగా నిలిచే దేశాలపై క్షిపణులు ప్రయోగిస్తామని పాకిస్తాన్‌ కశ్మీర్‌ వ్యవహారాల మంత్రి అలీ అమిన్‌ గందపర్‌ చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి. భారత్‌తో తమ దేశం కచ్చితంగా యుద్ధానికి దిగుతుందని, క్షిపణులతో దాడి చేస్తామని అలీ అమిన్‌ అన్నారు. ఈ విషయంలో తమకు కాకుండా భారత్‌కు మద్దతుగా నిలిచే దేశాలపై కూడా క్షిపణులు ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఈ వీడియోను పాకిస్తాన్‌ జర్నలిస్టు నైలా ఇనాయత్‌ ట్వీట్‌ చేయడంతో నెటిజనులు కామెంట్లు, ఫొటోలతో సెటైర్లు వేశారు.

‘గుడ్‌ జోక్‌’ అంటూ అలీ అమిన్‌ వ్యాఖ్యలపై ట్విటర్‌లో కామెంట్లు వచ్చాయి. ఆయన అణ్వాయుధాల గురించి మాట్లాడుతున్నారా లేక స్వీట్ల గురించా మరొకరు ఆట పట్టించారు. అల్లాటప్పాగా పేల్చడానికి క్షిపణులు ఏమైనా దీపావళి టపాసులు అనుకుంటున్నారా అని ఇంకొరు చురక అంటించారు. యుద్ధం మొదలైతే ఎక్కడ తలదాచుకుంటారు? ముందుగానే పాకిస్తాన్‌ విడిచి పారిపోండి అంటూ సలహా కూడా ఇచ్చారు. యుద్ధమంటే ఆయనకు ఆటలా ఉందని వ్యాఖ్యానించారు. బుల్లి మిస్సైల్స్‌ ఫొటో పెట్టి.. ‘ఇవేనా మీరు ప్రయోగించేవి పావ్‌ కిలో వాలే’ అంటూ కామెంట్‌ చేశారు. పాకిస్తాన్‌ నుంచి ఒక్క క్షిపణి వస్తే 10 క్షిపణులతో బుద్ధి చెబుతామని వార్నింగ్‌ ఇచ్చారు. (చదవండి: భారత్‌, ఆ దేశాలపై మిసైల్‌ వేస్తాం: పాక్‌)
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా