అలీ బాబా ఒక రోజు అమ్మకాలు రూ.91 వేల కోట్లు

12 Nov, 2015 10:03 IST|Sakshi
అలీ బాబా ఒక రోజు అమ్మకాలు రూ.91 వేల కోట్లు

బీజింగ్: చైనా ఈ కామర్స్ జెయింట్ అలీబాబా గ్రూప్ తన రికార్డును తానే బద్ధలుకొట్టేసుకుంది. గత ఏడాది ఒక రోజు జరిపిన అమ్మకాలకన్న ఈ ఏడాది ఒకే రోజు రికార్డు శాతంలో అమ్మకాలు జరిపి దాదాపు 50శాతం అధిక ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది ఈ సంస్థ ఒకరోజు ఆన్ లైన్ ద్వారా దాదాపు 9.3 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపి రికార్డు సృష్టించగా ఈసారి దానిని అధిగమించి 13.8 బిలియన్ డాలర్లు(దాదాపు.రూ.91,00,00,00,000) అమ్మకాలు జరిపి చరిత్ర సృష్టించింది.

ఈ విషయాన్ని చైనాకు చెందిన బీడీఏ అనే సంస్థ చైర్మన్ డంకన్ క్లార్క్ స్పష్టం చేశారు. 'చైనా ఈ కామర్స్ మార్కెట్ లో అలిబాబా నంబర్ వన్ స్థానంలో నిల్చుంది. దీనిని అలాగే కొనసాగించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాం' అని అలీ బాబా ప్రతినిథులు తెలిపారు. 'మరో ఐదేళ్లలోగా చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ సంస్థగా మారనుంది. ఏరకమైనా వస్తువునైనా ఎగుమతి చేసే సామర్థ్యంతో ఉంటుంది' అని మైఖెల్ ఈవాన్స్ అనే అలీ బాబా ప్రతినిధి వివరించారు. మిగితా సంస్థలు కూడా తమతో పోటీ పడి ఆన్ లైన్ విక్రయాలు జరుపుతున్నా అవి స్పష్టతను కొనసాగించడంలో విఫలమవుతున్నాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు