పనిరాక్షసుడి పనిష్మెంట్ ఇంత ఘోరమా!

23 Apr, 2016 10:43 IST|Sakshi
పనిరాక్షసుడి పనిష్మెంట్ ఇంత ఘోరమా!

ప్రపంచంలోనే క్రూరమైన పనిరాక్షసులు ఎవరు? ఈ ప్రశ్నకు జవాబు చెప్పుకునేముందు మిగతావాళ్లు ఏవిధంగా పనిచేస్తున్నారో చూద్దాం. 'వారం ఐదు నాళ్లు శ్రమకే జీవితం.. చివరి రెండు రోజులు ప్రకృతికి అంకితం' అంటూ అమెరికా లాంటి పశ్చిమదేశాల్లో ఉద్యోగాలు ఎంత హాయిగాచేసుకోవచ్చో వివరిస్తారు 'కొలంబస్.. కొలంబస్'పాటలో.

ఇక మన దేశంలో పనిదినాలు వారానికి ఆరురోజులైనా ఆదివారాన్ని మాత్రం మన నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. 'త్వరలోనే ఐదు రోజుల పనివిధానాన్ని అమలులోకి తెస్తాం' అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం మరో సంతోషకరమైన విషయం. ఇక భూగోళానికి తూర్పున ఉండే జపాన్, చైనాలంటారా.. పనిలో రాక్షసత్వాన్ని సాధ్యమైనంత ఎక్కువస్థాయిలో ప్రదర్శిస్తుంటాయి. ప్రధానంగా చైనీయులు 'ప్రపంచంలోనే ఘోరమైన పనిరాక్షసులు' అని పేరు తెచ్చుకున్నారు. వాళ్ల పనివిధానం ఎంత కఠినంగా ఉంటుందో ఈ కామర్స్ దిగ్గజం జాక్ మా జీవితకథలో మరోసారి వెల్లడైంది.

ప్రదేశం నుంచి 15 నిమిషాల దూరంలో ఉంటున్నాడని ఓ ఉద్యోగిని నిర్ధాక్షణ్యంగా పనిలో నుంచి తీసేశాడట పనిలో రాక్షసుడైన జాక్ మా! ఏదైనా కంపెనీలో పనిచేస్తే దానికి దగ్గరలోనే నివసించాలనే నిబంధనను చైనా కంపెనీలు ఎప్పటినుంచో అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. 1999లో ఈ కామర్స్ స్టార్ట్ అప్ గా ప్రారంభమైన ఆలీబాబా కంపెనీ అనతికాలంలోనే 200 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించిందంటే దానికి ఆ సంస్థ సీఈవో జాక్ మా పనిరాక్షసత్వమే కారణమట. జాక్ మా జీవితంపై రచయిత డీకన్ క్లార్క్ రాసిన 'ఆలీబాబా: ద హౌస్ దట్ జాక్ మా బిల్ట్' అనే పుస్తకంలో ఈ కఠిన వాస్తవాలు వెల్లడయ్యాయి.

'రోజుకు కనీసం 21 గంటలు పనిచేసే అలీబాబా ఉద్యోగులు తాము నివసించే ప్రదేశం ఆఫీస్ నుంచి కేవలం పదంటే పది నిమిషాల దూరంలో ఉండాలనే నిబంధన కఠినంగా అమలయ్యేది. 15 నిమిషాల దూరంలో ఉంటున్నాడన్న కారణంతో సంస్థలో మొదటిగా చేరిన వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలిగించారు. ఈ కామర్స్ రంగంలో టైమ్ చాలా విలువైనది. అందుకే మా సంస్థలో పనిచేసేవారికి ఆఫీసుల్లోనే భోజనాలు వగైరా ఏర్పాట్లు చేస్తుంటాం. 24 గంటలూ ఉద్యోగులు మాకు అందుబాటులో ఉండాలి. ఎప్పుడు కాల్ చేసినా అటెండ్ చేయాల్సిందే. అయితే కంపెనీ లాభాలబాట పట్టాక దశలవారీగా ఆ కఠిన నిబంధనలను ఎత్తేశాం' అని కంపెనీ ప్రారంభంలో మేనేజ్ మెంట్ ఎంత కఠినంగా ఉండేదో వివరిస్తారు అలీబాబా అధికార ప్రతినిధి. ఇప్పుడు మళ్లీ చెప్పండి.. ప్రపంచంలోనే క్రూరమైన పనిరాక్షసులు ఎవరు?

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా