ముస్లిం మహిళా ప్రొఫెసర్ సంచలన వ్యాఖ్యలు

18 Jan, 2016 18:48 IST|Sakshi
ముస్లిం మహిళా ప్రొఫెసర్ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్: యుద్ధ సమయంలో ముస్లిం మతానికి చెందిన పురుషులు, ముస్లిమేతర మహిళలపై అత్యాచారాలు చేయడం  చట్టబద్ధమని  ఇస్లామిక్  మహిళా ప్రొఫెసర్  వ్యాఖ్యానించడం కలకలం రేపింది.  ఈజిప్ట్లోని కైరో, ప్రఖ్యాత అల్ అజహర్ యూనివర్శిటీకి  చెందిన  ప్రొఫెసర్  సాద్ సాలెహ్ ఓ  టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

చట్టబద్ధమైన యుద్ధాన్ని కొనసాగించేటపుడు ముస్లిం మత పురుషులు బానిస స్త్రీలతో లైంగిక సంబంధాలు కలిగి ఉండడం  పూర్తిగా ఆమోదయోగ్యమైనదే అని ఆమె అన్నారు.  దీన్ని అల్లా కూడా అంగీకరిస్తారని,  అయితే  ఇజ్రాయెల్కు,  వారి శత్రువులకు మధ్య  జరిగే 'చట్టబద్ధమైన యుద్ధం' సమయంలో మాత్రమే ఇది వర్తిస్తుందని సాద్ సాలెహ్ పేర్కొన్నారు.

యుధ్ద సమయంలో బానిసలుగా ఉన్న మహిళా  ఖైదీలను  కించపరిచి  హింసించడంకన్నా,  వారిని లొంగదీసుకుని, సొంత ఆస్తిలాగా భావించడం సరైందన్నారు.  ఆ సమయంలో  వారు ముస్లిం మత  సైన్యం కమాండర్ ఆస్తిగా మారతారన్నారు.  ఈ క్రమంలో వారు భార్యలతో  సమానంగా  ఆ మహిళలతో లైంగిక సంబంధాలను కలిగి వుండొచ్చని వ్యాఖ్యానించారు.

దీంతో  ముస్లిం మత పెద్దలు సహా పలువురు సభ్యులు సాద్ సాలెహ్ వాదనలను ఖండించారు.  ఇస్లాం మతంపై తప్పుడు వ్యాఖ్యానాలు  చేశారని మండిపడ్డారు. మత విశ్వాసాలకు వ్యతిరేకంగా  తప్పుడు ప్రచారం  చేస్తున్నారని ప్రొఫెసర్పై  విరుచుకుపడ్డారు.
 

మరిన్ని వార్తలు