అమెజాన్‌ కార్చిచ్చుల ఎఫెక్ట్‌

30 Nov, 2019 06:15 IST|Sakshi

2000 కి.మీ.ల దూరంలో ఉన్న హిమనీనదానికి ముప్పు

వాషింగ్టన్‌: పుడమికి ఊపిరితిత్తుల్లాంటి అమెజాన్‌ అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చు వల్ల ఏర్పడిన దుష్పరిణామాలు ఇంకా కొనసాగుతున్నాయి. అమెజాన్‌ అడవులకు దాదాపుగా 2 వేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న అండిస్‌ పర్వత శ్రేణుల్లోని హిమనీనదాలు కరిగిపోతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ అనే జర్నల్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. అడవులు తగలబడడంతో సూక్ష్మమైన కాలుష్యకారక బొగ్గు కణాలు గాల్లో కలుస్తాయి. ఇవి వాయువేగంతో ప్రయాణించి అండీన్‌ హిమనీనదంపై పేరుకుంటున్నాయి. బ్రెజిల్‌కు చెందిన రియోడీజనీరో స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అమెజాన్‌ కార్చిచ్చులకు, హిమనీనదాలు కరగడానికి మధ్య సంబంధంపై అధ్యయనం చేసి ఈ విషయాలు వెల్లడించారు.

మరిన్ని వార్తలు