ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

16 Jul, 2019 14:00 IST|Sakshi

పని పరిస్థితులు, వేతనాలపై  నిరసన సెగ

రోడ్డెక్కిన వేలాదిమంది ఉద్యోగులు

2,70,000మంది సంతకాలతో జెఫ్‌ బెజోస్‌కు  పిటిషన్‌

శాన్‌ఫ్రాన్సిస్కో : అమెరికా రిటైల్ దిగ్గజం అమెజాన్‌కు భారీ షాక్‌  తగిలింది.  వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా  ప్రతిష్టాత్మక ప్రైమ్‌ డే సేల్‌ను ఇలామొదలుపెట్టిందో లేదో అలా అమెజాన్‌ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.  పని పరిస్థితులు, వేతనాలు తదితర అంశాలపై నిరసన వ్యక్తం  చేస్తూ వేలాది మంది ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా రోడ్డెక్కారు. తమ పని పరిస్తితులు మెరుగుపర్చాలని, పర్యావరణ హితంగా పనిచేయాలని,  అమెరికన్‌ ఇమ్మిగ్రేషన​ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌​ (ఐసీఈ)తో సంబంధాలను తెంచుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగులు ప‍్లకార్డులను  ప్రదర్శించారు. 

ముఖ్యంగా  శాన్ఫ్రాన్సిస్కో , సియాటెల్‌,  మిన్నెసోటాలోని షాకోపీ అమెజాన్‌ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారని టెక్ క్రంచ్ నివేదించింది. అమెరికా సహా యూరోప్‌లోని పలు నగరాల్లో ఉద్యో‍గుల నిరసన వెల్లువెత్తిందిని రిపోర్ట్‌  చేసింది. అంతేకాదు పలు నగరాల్లో తమ నిరసన కొనసాగించాలని ప్లాన్‌ చేశారని తెలిపింది. 1 ట్రిలియన్‌ డాలర్లుగా పైగా సంపదతో అలరారుతున్న అమెజాన్‌లోని ఉద్యోగులు తమకు సరియైన వేతనాలు లభించడంలేదనీ, కనీసం బాత్‌రూం విరామం(చాలా తక్కువ) కూడా ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారని న్యూస్‌వీక్‌ నివేదిక తెలిపింది. అంతేకాదు కార్మికుల హక్కులను పరిరక్షించాలని కోరుతో  రెండు లక్షల 70వేల  మంది  సంతకాలతో ఒక పిటిషన్‌ను అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌కు ఇంటికి పంపించనున్నారట.

మరిన్ని వార్తలు