ఇమ్రాన్‌ ఖాన్‌కు షాకిచ్చిన ట్రంప్‌

2 Sep, 2018 17:23 IST|Sakshi
డొనాల్డ్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌ : పాకిస్తాన్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి షాకిచ్చింది. ఉగ్రవాదుల ఏరివేతకు పాక్‌ ఆర్మీకి సహాయంగా ఇవ్వాల్సిన 300 మిలియన్‌ డాలర్లు ( 2130.15) కోట్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఉగ్రవాదుల ఏరివేతలో పాకిస్తాన్‌ విఫలమైందని, తామిచ్చే సహాయాన్ని మిలిటెంట్లపై దాడులకు పాక్‌ ఉపయోగిచలేపోయిందని అగ్రరాజ్యం వ్యాఖ్యానించింది. పాక్‌కు సహాయంగా ఇవ్వాల్సిన 500 మిలియన్‌ డాలర్ల నిధులకు ఇటీవల యూఎస్‌ కాంగ్రెస్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ షాక్‌ నుంచి తేరుకోకముందు పాకిస్తాన్‌కు ట్రంప్‌ మరో భారీ షాక్‌ ఇచ్చారు. ఈ మేరుకు పెంటగాన్‌ అధికార ప్రతినిధి  కోనీ ఫౌల్క్‌నర్‌ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘ఉగ్రవాద కార్యకలపాలను నివారించడంలో పాకిస్తాన్‌ ఘోరంగా విఫలమైంది. పాక్‌ విషయంపై అమెరికా తీవ్ర అసహనంతో ఉంది. ఉగ్రవాద చర్యలకు అణచివేసేందుకు పాక్‌పై మరింత ఒత్తిడి తెచ్చెందుకు ప్రయత్నిస్తాం. లష్కరే తోయిబా, హాక్కాని నెట్‌వర్క వంటి ఉగ్రవాదల సంస్థలను ఏరివేయడానికి ప్రయత్నిస్తాం. పాక్‌కు నిధుల విడుదల పూర్తిగా యూఎస్‌ కాంగ్రెస్‌కు సంబంధించిన విషయం. వారి అనుమతిలేనిది నిధులను విడుదల చేయలేం ’’ అని తెలిపారు. గత కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాకిస్తాన్‌పై తీవ్ర అసహనంతో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ట్రంప్‌ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. వారికి మాపై నిందలు మోపడం తప్ప మరోమి తెలీదని పాకిస్తాన్‌పై పలు ఆరోపణలు చేశారు. కాగా ఇటీవల పాక్‌ నూతన ప్రధానిగా ఎన్నికైన ఇమ్రాన్‌ ఖాన్‌కు ఇది భారీ షాక్‌గా భావించవచ్చు.

మరిన్ని వార్తలు