అమెరికాలో లోయలోకి పల్టీకొట్టిన కారు

9 Dec, 2013 02:23 IST|Sakshi

 మృత్యుంజయులు..!
 అమెరికాలో లోయలోకి పల్టీకొట్టిన కారు
 వాషింగ్టన్: కొండ అంచున ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పింది... 250 అడుగుల లోయలోకి జారిపడింది... ఏడుసార్లు పల్టీలు కొట్టింది... ఈ ప్రమాదం తీరు చూస్తే అందులోనున్న ఏ ఒక్కరూ బతికి బయటపడే అవకాశమే లేదనిపిస్తుంది! కానీ అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో గత బుధవారం చోటుచేసుకున్న ప్రమాదంలో నలుగురు సభ్యుల కుటుంబం ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై సీబీఎస్ న్యూస్ కథనం ప్రచురించింది. ఆరిజోనా ఉత్తరప్రాంతంలోని టొనాలియాకు చెందిన కొలీన్ సావజె అనే మహిళ తన సోదరి, ఆమె ఇద్దరు పిల్లలతో కలసి కారులో ప్రయాణమయ్యారు.
 
  జాతీయ రహదారిపై మిన్‌గస్ పర్వత పాద ప్రాంతానికి చేరుకొనేసరికి హిమపాతం మొదలైంది. ఆ సమయంలో కేవలం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వారి కారు మంచుదిబ్బను ఢీకొని అదుపుతప్పింది. కొండ మలుపులో నుంచి250 అడుగుల లోయలోకి జారిపడింది. ఈ స మయంలో సావజె సమయస్ఫూర్తితో కారులోని వారిని అప్రమత్తం చేశారు. పల్టీ లు కొడుతున్న కారులోనుంచి ఎవ్వరూ బయటపడిపోకుండా కాపాడగలిగారు.
 

మరిన్ని వార్తలు