పాక్‌కు అమెరికా హెచ్చరిక

16 Feb, 2019 06:01 IST|Sakshi

ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం, ఆశ్రయం కల్పించడాన్ని తక్షణం మానుకోవాలని పాకిస్తాన్‌ను అమెరికా గట్టిగా హెచ్చరించింది. పుల్వామా ఉగ్రదాడిని అగ్ర దేశం ఖండించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రెస్‌ సెక్రటరీ శాండర్స్‌ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండడాన్ని పాక్‌ విరమించుకుని ఆ దేశంలో ఉన్న అన్ని ఉగ్రవాద సంస్థలకు మద్దతును నిలిపేయాలి. పుల్వామాలో దాడి వల్ల అమెరికా, భారత్‌ల మధ్య ఉగ్రవాద వ్యతిరేక సహకారం, సమన్వయం మరింత పెరుగుతాయి’ అని తెలిపారు. బాధిత కుటుంబాలు, భారత ప్రభుత్వం, ప్రజలకు తాము సానుభూతి తెలుపుతున్నామన్నారు. 

మరిన్ని వార్తలు