‘నేను కరోనా బారిన పడ్డాను.. కానీ!’

21 Mar, 2020 12:08 IST|Sakshi

వాషింగ్టన్‌: ఆమెరికాకు చెందిన ఓ యువతి కరోనా వైరస్‌ బారిన పడ్డానని.. ప్రస్తుతం కోలుకుంటున్నానని శనివారం సోషల్‌ మీడియాలో ప్రకటించింది. ఈ వైరస్‌పై ఒత్తిడి, ఆందోళన వద్దని.. అవగాహనతో వైరస్‌ బారి నుంచి బయటపడొచ్చని తెలిపింది. అమెరికాలో నివసిస్తున జొండా హాలిటి(22) అనే యువతి కరోనాపై బయటపడాల్సిన అవసరం లేదని సరైన అవగాహనతో వైరస్‌ను తగ్గించుకోవచ్చని చెప్పింది.  ‘మొదట నాకు తేలికపాటి పొడి దగ్గు, గొంతు నొప్పితో ప్రారంభమైంది. ఆ తర్వాత కాసేపటికి అలసటగా అనిపించింది. ఆ మరుసటి రోజు అసౌకర్యంగా అనిపించడమే కాకుండా చలిజ్వరం వచ్చింది. ఆ తర్వాత కళ్లు మంటగా అనిపించి నీరు కారడం మొదలైంది. దీనికితోడు తలనొప్ప కూడా రావండంతో ఓ రోజు మొత్తం​ విశ్రాంతి తీసుకున్నాను. కానీ ఆ తర్వాత రోజు తీవ్రత మరింత ఎక్కువైంది’ అంటూ ట్వీట్‌ చేసింది. (కరోనా: ఎక్కడ పడితే అక్కడ తిరిగితే ప్రాణాలే పోవచ్చు!)

చదవండి: కనికా ఎఫెక్ట్‌: నిర్బంధంలోకి ఎంపీలు, మాజీ సీఎం

అంతేగాక ‘‘పొడిదగ్గు, గొంతు నొప్పి, జ్వరం, ముక్కు నుంచి అతిగా నీరు కారడం, ఇంకా ఆలసటగా అనిపించడంతో డాక్టర్‌ను సంప్రదించాలని నిర్ణయించుకున్న. ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాను. పరీక్షలో నెగటివ్‌ వచ్చింది. డాక్టర్లు కూడా ఫ్లూ లేదా ఇతర ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తేల్చారు. అయితే ఇంటికి వచ్చాక కాస్తా ఆలసట, జ్వరం తగ్గినప్పటీకీ.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాను. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన కరోనా వైరస్‌ లక్షణాలను కనుగొన్నాను. దీంతో బయపడి కరోనా పరీక్షలు చేయించుకోవాలని నిర్ధారించుకున్న’’  అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఇక మరుసటి రోజు ఆసుపత్రికి కరోనా పరీక్షలు చేయించుకున్నానని. చివరకూ కరోనా పాజిటివ్‌ వచ్చిందని చెప్పింది. వెంటనే తనకు తానుగా ఐసోలేషన్‌కు వెళ్లినట్లు పెర్కొంది. (వైట్‌హౌస్‌లో కరోనా కలకలం)

ఈ క్రమంలో రోజూ కాస్తా ఎండలో ఉండటంతో పాటు, అమెరికా వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రాలు (సీడీసీ) సూచించిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని జొండా చెప్పారు. ఇక క్రమంగా నాలోని వ్యాధి లక్షణాలు తగ్గడం ప్రారంభమైందని, ఇప్పటికీ స్వీయ నిర్భంధంలోనే ఉన్నానని తెలిపింది. ఇక ఈ ట్వీట్‌కు ఇప్పటీ వరకు 1.1 మిలియన్ల హార్ట్‌ ఎమోజీలు రాగా ఇప్పటికీ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ విషయాన్ని పంచుకున్నందుకు జొం‍డాను ప్రశంసలు జట్లు కురిపిస్తున్నారు. ‘ఇది నీజంగా అద్భుతం. ఈ విషయాన్ని మాతో షేర్‌ చేసుకున్నందుకు ధన్యవాదాలు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాపించకుండా ప్రపంచ దేశ ప్రభుత్వాలు అవగాహన చర్యలు చేపడుతున్నాయి. ప్రముఖులు సెలబ్రెటీలు సైతం కరోనా వ్యాప్తి చెందకుండా తమ వంతు కృషి చేస్తున్నారు. ఇక కరోనాను అరికట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ‘జనత కర్ఫ్యూ’ దేశ ప్రజలకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు