‘సింగపూర్‌ ఎక్కడుంది...?’

12 Jun, 2018 13:17 IST|Sakshi

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ట్రంప్‌ - కిమ్‌ల భేటీ మంగళవారం, సింగపూర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు అధ్యక్షుల భేటీ నేపధ్యంలో అమెరికా ప్రజలు గూగుల్‌లో ఎక్కువగా సర్చ్‌ చేసింది దేని గురించో తెలుసా...‘వేర్‌ ఇజ్‌ సింగపూర్‌ ఇన్‌ ది వరల్డ్‌?’(ప్రపంచంలో సింగపూర్‌ ఎక్కడుంది?). వీరిద్దరి భేటీ గురించి ప్రకటించిన తర్వాత చాలా మంది అమెరికన్స్‌ సింగపూర్‌ గురించే ఎక్కువగా సర్చ్‌ చేశారంట. దాంతో పాటు ‘ఉత్తర కొరియా ఎక్కడుంది?’, ‘సింగపూర్‌ చైనా లేదా జపాన్‌లో భాగమా?’ లేదా ‘సింగపూర్‌ స్వయంగా ఒక దేశమా..?’ వంటి పలు ఆసక్తికర అంశాల గురించి సర్చ్‌ చేశారంట. కేవలం సింగపూర్‌ గురించే కాక మరికొందరు కిమ్‌ గురించి కూడా సర్చ్‌ చేసారంట. ‘కిమ్‌ ఎత్తు ఎంత..?’, ‘కిమ్‌ ఇంగ్లీష్‌ మాట్లడగలడా...?’ అంటూ సర్చ్‌ చేసారు.

ట్రంప్‌ - కిమ్‌లు ఇద్దరు సింగపూర్‌లోని సెంటసోలోని కెపెల్లా ద్వీపంలో మంగళవారం ఉదయం భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 48 నిమిషాల పాటు ట్రంప్‌ - కిమ్‌ మధ్య చర్చలు జరిగాయి. అణ్వాయుధాలను వీడాలని, అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా సహకరించాలని ట్రంప్‌ కిమ్‌కు సూచించారు. ఇందుకు అంగీకరిస్తే.. ఉత్తర కొరియా భద్రతకు హామీ ఇస్తామని, దీనితోపాటు ఆర్థిక సాయం అందిస్తానని ట్రంప్‌ ఆఫర్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కిమ్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదని ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు