అమెరికా సుప్రీంకు భారత సంతతి జడ్జి!

29 Jun, 2018 02:07 IST|Sakshi
అమూల్‌ థాపర్

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన న్యాయ నిపుణుడు అమూల్‌ థాపర్‌(49) అమెరికా సుప్రీంకోర్టులో జడ్జిగా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 31న జడ్జి జస్టిస్‌ ఆంథోని కెన్నెడీ పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో నియమించేందుకు రూపొందించిన 25 మందితో కూడిన జాబితాలో థాపర్‌ పేరు ఉంది.

ఈ జాబితా నుంచే ఒకరిని కెన్నెడీ స్థానంలో నియమిస్తానని ట్రంప్‌ ఇది వరకే స్పష్టం చేశారు. కెన్నెడీ స్థానాన్ని భర్తీచేసేందుకు ట్రంప్‌ మనసులో ఉన్న తుది ఏడుగురిలో థాపర్‌ ఉన్నారని వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించింది. గతేడాదే ఆయన కెంటకీ జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. 1991లో బోస్టన్‌ కాలేజీ నుంచి బీఎస్‌ పూర్తిచేసిన థాపర్‌..కాలిఫోర్నియా వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందారు.

>
మరిన్ని వార్తలు