‘లవ్‌ ప్రపోజ్‌ బాగానే చేశాననుకున్నా.. కానీ’

17 Jan, 2020 20:50 IST|Sakshi

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహింద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా మరోసారి ఓ వైరల్‌ న్యూస్‌ని పరిచయం చేశారు. బోస్టన్‌కు చెందిన సినీ దర్శకుడొకరు లవ్‌ ప్రపోజ్‌ ఎలా చేశాడో పేర్కొంటూ ఓ చక్కని వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘ఈ వీడియో క్లిప్‌ ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అయింది. తన చిన్ననాటి స్నేహితురాలికి ప్రేమ విషయం చెప్పేందుకు ఓ వ్యక్తి ఏకంగా డిస్నీ సినిమానే ఎంచుకున్నాడు. దానిని చక్కగా ఎడిట్‌ చేసి.. తన ప్రేమను ఘనంగా.. అత్యద్భుతంగా తెలియజేశాడు. 40 ఏళ్ల క్రితం నా ప్రేమను కూడా చాలా గొప్పగా ప్రపోజ్‌ చేశాను అనుకున్నాను. కానీ, ఈ వీడియో చూశాక.. మరీ ఘనంగా నా ప్రేమను వ్యక్త పరచలేదనిపిస్తోంది’అని ఆనంద్‌ మహింద్రా పేర్కొన్నారు.

వీడియో క్లిప్‌లో ఏముంది..!
బోస్టన్‌కు చెందిన సినీ దర్శకుడు లీ లోచ్లర్‌ తన చిన్ననాటి స్నేహితురాలికి వినూత్నంగా లవ్‌ ప్రజోజ్‌ చేద్దామనుకున్నాడు. దానికోసం ప్రసిద్ధ డిస్నీ యానిమేషన్‌ మూవీ ‘స్లీపింగ్‌ బ్యూటీ’ని ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ చిత్రకారుడి సాయంతో.. స్లీపింగ్‌ బ్యూటీలోని ఓ సన్నివేశాన్ని ఎడిట్‌ చేశాడు. ప్రత్యేకంగా ఓ థియేటర్‌ను అద్దెకు తీసుకుని ఆ సినిమా కొనసాగుతుండగా.. అనూహ్యంగా హీరో హీరోయిన్లకు బదులు లీ లోచ్లర్‌, అతని స్నేహితురాలు డాక్టర్‌ స్తుతి చిత్రాలు దర్శనమిస్తాయి. సినిమాలో మాదిరిగా థియోటర్‌లో జరుతున్న సన్నివేశాలతో స్తుతి సంభ్రమాశ్చర్యంలో మునుగుతుంది. ఇక లీ లోచ్లర్‌ ఓ డైమండ్‌ రింగ్‌తో తన బ్యూటీకి లవ్‌ ప్రపోజ్‌ చేస్తాడు. ఆమె అతని ప్రేమకు ఫిదా అవుతుంది. ఈ అద్భుత ప్రేమ వ్యక్తీకరణ గత డిసెంబర్‌ 30న అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో జరిగింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా