కోట్ల ఏళ్ల క్రితం భూమి ఎలా ఉండేదంటే..!

4 Mar, 2020 08:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వాషింగ్టన్‌: ఒకప్పుడు భూమి పూర్తిగా నీటితో కప్పి ఉండేదని ఓ తాజా అధ్యయనంలో తేలింది. దాదాపు 300 కోట్ల సంవత్సరాల కింద భూమి ఇలాగే ఉండేదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనం ద్వారా భూమిపై ఏక కణజీవులు ఎక్కడ, ఎలా పరిణామం చెందాయో పరిశోధకులు తెలుసుకునే వీలుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పురాతన భూగోళం ఎలా ఉండేదన్న చర్చలకు ఈ అధ్యయనం ద్వారా సమాధానం దొరికినట్లయిందని అమెరికాలోని కొలరాడో వర్సిటీకి చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ బోస్‌వెల్‌ వివరించారు. ఆస్ట్రేలియాలోని పనోరమా జిల్లాలో ఉన్న కొండలు, పర్వతాలు ఒకప్పుడు నదీ ప్రవాహాల కారణంగా ఏర్పడి ఉంటాయని అయోవా స్టేట్‌ వర్సిటీకి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జాన్సన్‌ తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు నేచుర్‌ జియోసైన్స్‌ ఆన్‌లైన్‌ జర్నరల్‌లో పెట్టారు. (చదవండి: టోర్నడో విధ్వంసం)

>
మరిన్ని వార్తలు