ట్రూడో మంత్రివర్గంలో తొలి హిందూమంత్రి

21 Nov, 2019 10:13 IST|Sakshi

ఒటావా: కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తాజాగా జరిపిన మంత్రివర్గ విస్తరణలో అనితా ఇందిరా ఆనంద్‌ చోటుదక్కించుకున్నారు. కేంద్రమంత్రి వర్గంలో చోటుదక్కించుకున్న తొలి హిందూ మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. కాగా ఇటీవల ఆమె పార్లమెంట్‌కు ఎన్నికయిన విషయం తెలిసిందే. అక్టోబర్‌లో జరిగిన హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సభకు ఆమె అర్హత సాధించారు. అలాగే తొలి హిందూ పార్లమెంటేరియన్‌గా కూడా అనిత ప్రత్యేక గుర్తింపును పొందారు. టొరంటోలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్న ఆమె.. తొలిసారి మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు. కాగా అనిత తల్లిదండ్రులు భారత్‌కు చెందిన వారు కావడం విశేషం. బుధవారం ఏర్పడిన నూతన వర్గంలో మరో ముగ్గురు కొత్త వారికి కూడా ట్రూడో చోటుకల్పించారు. వీరంతా ఇండో-కెడియన్‌కు చెందిన సిక్కు సామాజిక వర్గానికి చెందిన వారు.

మరిన్ని వార్తలు