-

మరో నలుగురికి ఉరి

22 Dec, 2014 07:59 IST|Sakshi
మరో నలుగురికి ఉరి
  • ముషార్రఫ్‌పై దాడి కేసులో ఉగ్రవాదులకు శిక్ష అమలు
  • లాహోర్: పాకిస్తాన్ ప్రభుత్వం మరో నలుగురు ఉగ్రవాదులకు మరణశిక్ష అమలు చేసింది. పదకొండేళ్ల క్రితం మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్‌పై దాడి కేసుకు సంబంధించి జుబైర్ అహ్మద్, రషీద్ ఖురేషీ, గులామ్ సర్వార్ భట్టి, రష్యా పౌరుడైన అఖ్లాక్యూ అహద్‌లను పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్ జిల్లా జైలులో అధికారులు ఆదివారం ఉరి తీశారు.

    షెషావర్‌లోని సైనిక పాఠశాలపై తాలిబాన్ ఉగ్రవాదుల మారణహోమం తర్వాత పాక్ మరణశిక్షపై  నిషేధాన్ని ఎత్తేయడం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఇదే జైలులో ఇద్దరు ఉగ్రవాదులను ఉరి తీశారు. ఫైసలాబాద్ సెంట్రల్ జైలులో మరణశిక్ష అమలుకు అవకాశం లేకపోవడంతో వీరిని కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా జైలుకు తరలించారు.  మరోవైపు లాహోర్‌లో సెంట్రల్ జైలులో మరో నలుగురు ఉగ్రవాదులకు సోమ, మంగళవారాల్లో ఉరి శిక్ష అమలు చేసే అవకాశం ఉంది.
     

మరిన్ని వార్తలు